Kamatipura: సినిమాల్లో అవకాశాలు దొరక్క డ్రగ్స్ స్మగ్లర్‌గా మారిన హైదరాబాదీ

  • ఎలక్ట్రీషియన్‌గా పనిచేసిన ఇసాక్
  • హెరాయిన్‌ను అమ్మేందుకు వచ్చిన ఇసాక్
  • పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు

సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్ నుంచి నాలుగేళ్ల క్రితం ముంబై వెళ్లిన వ్యక్తి అవకాశాలు దొరక్క మాదక ద్రవ్యాలు విక్రయించే స్మగ్లర్‌గా మారి సొంత నగరంలోనే అమ్మేందుకు వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. కామాటిపురాలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేసే ఇసాక్ సినిమాల్లో నటించాలనే కోరికతో ముంబై వెళ్లాడు. అవకాశాలు దొరక్క, మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. డ్రగ్స్ ముఠాలతో చేతులు కలిపి డ్రగ్స్ విక్రయించే స్మగ్లర్‌గా మారాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో హెరాయిన్‌ను అమ్మేందుకు నగరానికి రాగా, పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు.

8 మంది ఉన్న అంతరాష్ట్ర ముఠాలో ఇసాక్ సహా ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 28 గ్రాముల హెరాయిన్, 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలను సరఫరా చేసే ఉస్మాన్ షేక్‌ను అరెస్ట్ చేస్తే ఈ ముఠాకు సంబంధించిన మొత్తం వ్యవహారం బయటకు వచ్చే అవకాశం ఉందని సీపీ అంజనీకుమార్ తెలిపారు. హెరాయిన్ ఒక్కో గ్రాము విలువ రూ.11 వేలు ఉంటుందని పేర్కొన్నారు. నగరంలో ఈ ముఠా కార్యకలాపాలపై సీపీ ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News