Andhra Pradesh: ఏపీలో ఎండల తీవ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- ఎండల తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలి
- విస్తృత స్థాయిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
- రక్షణ చర్యలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి: సీఎస్
ఏపీలో ఎండల తీవ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఈ మేరకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. ఎండల తీవ్రత దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచి జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని, రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని సుబ్రహ్మణ్యం ఆదేశించారు. చలి వేంద్రాల్లో తాగునీరు. మజ్జిగా అందించేలా చర్యలు తీసుకోవాలని, చలివేంద్రాలు ఏర్పాటు చేసేలా స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఆసుపత్రులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్ల వద్ద తాగునీటి వసతి కల్పించాలని, ప్రజలకు మందులు అందబాటులో ఉంచాలని, అంబులెన్స్ లతో వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని, పశువుల కోసం నీళ్ల తొట్టెలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రక్షణ చర్యలపై మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.