Supreme Court: సీజేఐపై లైంగిక ఆరోపణలను తోసిపుచ్చిన దర్యాప్తు కమిటీ

  • అంతర్గత విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ
  • మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలు నిజం కాదు
  • జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని కమిటీ

సీజేఐ రంజన్ గొగోయ్ పై వచ్చిన లైంగిక ఆరోపణలను సుప్రీంకోర్టు అంతర్గత దర్యాప్తు కమిటీ తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలపై అంతర్గత కమిటీ విచారణ జరిపింది. ఈ ఆరోపణలు నిజం కాదని, వీటిని బలపరిచే ఆధారాలేవీ లభించలేదని జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని కమిటీ తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన విచారణ నివేదికను సీజేఐకు సమర్పించింది. ఈ కమిటీ నివేదిక ఏం తేల్చిందన్న విషయాన్ని సీజేఐ సెక్రటరీ జనరల్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు.ప్యానెల్ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు ఫిర్యాదుదారురాలు నిరాకరించడం గమనార్హం.

కాగా, గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సదరు మహిళ ఇటీవల ఆరోపణలు చేసింది. ఈ విషయమై మొత్తం 22 మంది సుప్రీం కోర్టు జడ్జిలకు గత నెల 19న ఆమె లేఖ రాశారు. ఆ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ బాబ్డే నేతృత్వంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే.

  • Loading...

More Telugu News