kanaka reddy: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి.. సంతాపం ప్రకటించిన కేసీఆర్
- 2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి
- ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరిక
- 2014లో మల్కాజ్ గిరి నుంచి జయకేతనం
టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. 2009లో జరిగిన ఎన్నికల్లో ఆయన ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మల్కాజ్ గిరి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు.
కొన్ని కారణాల వల్ల ఈ ఎన్నికల్లో కనకారెడ్డికి టీఆర్ఎస్ టికెట్ దక్కలేదు. కనకారెడ్డిని కాదని మల్లారెడ్డికి టికెట్ ఇచ్చారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన కనకారెడ్డికి ద్రాక్ష తోటల పెంపకం అంటే చాలా ఇష్టం. ఉమ్మడి ఏపీలో ద్రాక్ష తోటల పెంపకందారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు. కనకారెడ్డి మృతి నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.