jana chaitany vedika: ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధం విధించాలి: కన్నా లక్ష్మీనారాయణ
- గుంటూరులో ‘మద్యపాన నిషేధం’ అంశంపై చర్చ
- చర్చలో పాల్గొన్న అజయ్ కల్లాం, వైసీపీ నేతలు
- మద్య నిషేధంపై సమగ్ర చర్చ జరగాలని సూచన
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధం విధించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘మద్యపాన నిషేధం’ అంశంపై చర్చ నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ, జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి, మాజీ సీఎస్ అజయ్ కల్లాం, వైసీపీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, లక్ష్మీపార్వతి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మద్యపాన నిషేధం విధించవచ్చని అభిప్రాయపడ్డారు. అజయ్ కల్లాం మాట్లాడుతూ, ప్రభుత్వాలు మద్యాన్ని ఆదాయ వనరుగా చూడకూడదని సూచించారు. మద్యపాన నిషేధం కోసం స్వచ్ఛంద సంస్ధలు పోరాడాలని కోరారు. దశలవారీగా మద్య నిషేధంపై సమగ్ర చర్చ జరగాలని కోరారు.