West Bengal: దేశంలో ఆరో విడత పోలింగ్ సమాప్తం
- దేశవ్యాప్తంగా 59 స్థానాలకు పోలింగ్
- పలుచోట్ల హింసాత్మక ఘటనలు
- పశ్చిమ బెంగాల్ లో వెల్లువెత్తిన ఓటర్లు
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ నిర్వహించిన ఆరో విడత పోలింగ్ ముగిసింది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్, బీహార్ లోని 59 లోక్ సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడం, పలుచోట్ల హింసాత్మక ఘటనలతో ఆరో దశ పోలింగ్ పరిసమాప్తి అయింది. కాగా, అత్యధికంగా పశ్చిమ బెంగాల్ లో దాదాపు 70 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఇక్కడ భారీస్థాయిలో మోదీ వ్యతిరేక ఓటు పడిందని భావిస్తున్నారు. కాగా, దేశంలో చివరి విడత పోలింగ్ మే 19న నిర్వహించనున్నారు. అనంతరం మే 23న ఫలితాలు వెల్లడిస్తారు.
సాయంత్రం 4 గంటల సమయానికి నమోదైన పోలింగ్ శాతం ఇలా ఉంది...
- పశ్చిమ బెంగాల్-70.51
- ఝార్ఖండ్-58.08
- మధ్యప్రదేశ్-52.78
- హర్యానా-51.86
- ఢిల్లీ-45.24
- బీహార్-44.40
- ఉత్తరప్రదేశ్-43.40