Harbhajan Singh: ఇదేం ఆహారం!... హైదరాబాద్ ఐటీసీ కాకతీయ హోటల్ అంటేనే అసహ్యం వేస్తోంది: హర్భజన్ సింగ్ ఫైర్
- ఆహారం సరిగా వండారా లేదా అని పట్టించుకోరా?
- మరీ ఇంత బిజీనా!
- హోటల్ సిబ్బంది స్పందించలేదని ట్వీట్
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్థానిక ఐటీసీ కాకతీయ హోటల్లో బస ఏర్పాటు చేశారు. అయితే, తమకు అందుబాటులో ఉంచిన ఆహారం సరిగా వండలేదంటూ సూపర్ కింగ్స్ బౌలర్ హర్భజన్ సింగ్ మండిపడ్డాడు. ఆహారం ఎలా వండారన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోరా? భజ్జీ ఆగ్రహంతో ప్రశ్నించాడు.
రూమ్ సర్వీస్ సిబ్బంది నుంచి మేనేజర్ వరకు ఎవరూ కూడా స్పందించడంలేదని, బహుశా వాళ్లు చాలా బిజీగా ఉన్నారనుకుంటా అంటూ ట్వీట్ చేశాడు. దేశంలోని ఐటీసీ హోటళ్లలో బస చేయడాన్ని తాను ఎంతో ఇష్టపడతానని, కానీ హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్ బస చేయడాన్ని మాత్రం అసహ్యించుకుంటానని పేర్కొన్నాడు.
As much as I love staying with you @ITCHotels in all the other cities ..I hate staying at #ITCKAKATIYA Hyderabad..No one cares bout food cooked properly or not.. No one respond to the calls from duty manager to room service..They seems to be to busy for the guests
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 12, 2019 ">