NSE: స్టాక్ మార్కెట్ ను దెబ్బతీసిన ఫార్మా షేర్ల అమ్మకాలు
- రెండు శాతం నష్టాలు చవిచూసిన ఫార్మా రంగం
- నష్టాలతో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్
- ఎస్బీఐ షేర్లకు డిమాండ్
ఇవాళ కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు పెద్దగా కలిసిరాలేదు. ఫార్మా రంగ షేర్ల అమ్మకాల ఒత్తిడి మార్కెట్ ను దెబ్బతీసింది. సెన్సెక్స్ 372 పాయింట్ల నష్టంతో 37,090 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 130 పాయింట్ల నష్టంతో 11,148 వద్ద క్లోజయింది. ఫార్మా రంగ షేర్లు 2 శాతం నష్టం చవిచూశాయి. ముఖ్యంగా సన్ ఫార్మా షేర్లు భారీ నష్టాలను చవిచూసినట్టు మార్కెట్ ట్రెండ్స్ చెబుతున్నాయి.
అయితే, నిఫ్టీ ఫైనాన్షియల్ సేవలు, నిఫ్టీ ఐటీ ఇండెక్స్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. మరోవైపు, అతిపెద్ద బ్యాంకింగ్ వ్యవస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. మార్చి త్రైమాసికంలో ఎస్బీఐ ఫలితాలు ఆకర్షణీయంగా ఉండడంతో షేర్లకు డిమాండ్ ఏర్పడింది.