Skymet: వచ్చే నెల 4న కేరళకు రుతుపవనాలు
- సాధారణంగా జూన్ 1నే కేరళ తీరాన్ని తాకుతాయి
- జూలై మధ్యలో దేశమంతా విస్తరించనున్న రుతుపవనాలు
- సరాసరి వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే చాన్స్
నైరుతి రుతుపవనాలు జూన్ 4న కేరళ తీరాన్ని తాకనున్నట్టు వాతావరణ శాఖ స్కైమెట్ వెల్లడించింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ కల్లా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయి. అనంతరం జూలై మధ్యలో దేశమంతా విస్తరిస్తాయి. అయితే, ఈసారి కొంచెం ఆలస్యంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్టు తెలుస్తోంది. దీని కారణంగా 2019లో సరాసరి వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదవనుందని స్కైమెట్ నేడు వెల్లడించింది. దేశ దీర్ఘకాల సగటులో 93 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశముందని తెలిపింది.