West Bengal: పశ్చిమ బెంగాల్ అధికారులపై ఈసీ ప్రతాపం... సీఈవోకు లేఖ రాయడంపై ఆగ్రహం
- కీలక అధికారులపై బదిలీ వేటు
- సీఐడీ ఏడీజీ రాజీవ్ కుమార్ ను కేంద్రంలో రిపోర్ట్ చేయాలంటూ ఆదేశం
- హోంశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శికీ తప్పని బదిలీ
పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఎన్నికల సంఘం ప్రభుత్వ అధికారులపై కొరడా ఝుళిపించింది. ఓవైపు అధికార తృణమూల్, బీజేపీల మధ్య వీధి పోరాటాలు తీవ్రరూపు దాల్చిన నేపథ్యంలో పలువురు ఉన్నతాధికారులపై ఈసీ బదిలీ వేటు వేసింది. సీఐడీ ఏడీజీ రాజీవ్ కుమార్ ను కేంద్రానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వెంటనే ఢిల్లీలోని హోంశాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎంతో కీలకమైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ భట్టాచార్యపైనా వేటు పడింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుని సీఈవోకు లేఖ రాయడంపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.