Andhra Pradesh: కర్నూలు, చిత్తూరు, విశాఖ, ప్రకాశం జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక!

  • జారీచేసిన ఏపీ విపత్తు నిర్వహణ శాఖ
  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్య
  • విద్యుత్ స్తంభాలు, భారీ చెట్లకు దూరంగా ఉండాలని సూచన

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ప్రకాశం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. కర్నూలు జిల్లాలోని కొత్తపల్లి, ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాలలో పిడుగులు పడతాయని హెచ్చరించింది. అలాగే చిత్తూరు జిల్లాలోని చినగొట్టిగళ్లు, పుల్లలచెరువు, రొంపిచర్లలో పిడుగులు పడవచ్చని తెలిపింది.

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, అర్ధవీడు, మార్కాపురంలోనూ ఆకాశం మేఘావృతమై పిడుగులు పడొచ్చని హెచ్చరించింది. విశాఖపట్నం జిల్లాలోని అనంతగిరి, జీకే వీధి, జి.మాడుగుల, అరకు ప్రాంతాలకు కూడా ఏపీ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలనీ, భారీ చెట్లు, పెద్దపెద్ద విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించింది. బలమైన ఈదురుగాలులతో పాటు మెరుపులు మెరుస్తుంటే విద్యుత్ పరికరాలకు దూరంగా ఉండాలని సూచించింది.

  • Loading...

More Telugu News