BSE: పాత రికార్డులు కనుమరుగు... ఆల్ టైమ్ రికార్డుకు సెన్సెక్స్!
- ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను పెంచిన ఎగ్జిట్ పోల్స్
- సోమవారం నాడు భారీగా లాభపడ్డ సూచికలు
- గత రికార్డులను దాటిన సెన్సెక్స్ సూచిక
మరోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో, స్టాక్ మార్కెట్ పరుగులకు అడ్డు లేకుండా పోయింది. సోమవారం నాడు భారీగా లాభపడ్డ సెన్సెక్స్, నేడు కూడా అంతే ఉత్సాహంగా సాగుతోంది. సెన్సెక్స్ ఆల్ టైమ్ రికార్డును దాటింది. గత రికార్డ్ అయిన 39,487 పాయింట్లను సెన్సెక్స్ దాటేసింది. ఒక దశలో 39,571.73 పాయింట్లను తాకి సరికొత్త రికార్డును నమోదు చేసింది.
ఈ ఉదయం 9.30 గంటల సమయంలో 39,463.08 పాయింట్ల వద్ద సెన్సెక్స్ కొనసాగుతోంది. ఇదే సమయంలో ఎన్ఎస్ఈ క్రితం ముగింపుతో పోలిస్తే 26 పాయింట్లు పెరిగి 11,855. 5 పాయింట్ల వద్ద ఉంది. డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ, ఇన్ ఫ్రాటెల్, రిలయన్స్ తదితర కంపెనీలు లాభాల్లో ఉండగా, టాటా మోటార్స్, బీపీసీఎల్, యస్ బ్యాంక్, గ్రాసిమ్, భారతీ ఎయిర్ టెల్ తదితర కంపెనీలు నష్టాల్లో నడుస్తున్నాయి.
#Sensex breaches its previous highest mark of 39487 currently at 39,554.28 pic.twitter.com/xWRCchgbMS
— ANI (@ANI) May 21, 2019