Supreme Court: వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించేది లేదు: తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

  • పిటిషన్ దాఖలు చేసిన టెక్నోపర్ ఆప్
  • మెరిట్ లేదని తిరస్కరించిన ధర్మాసనం
  • స్లిప్ ల లెక్కింపుపై జోక్యం చేసుకోబోమని వెల్లడి

వీవీప్యాట్లలోని అన్ని స్లిప్ లనూ లెక్కించి, ఈవీఎంలలో పోలైన ఓట్లతో సరిచూడాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. వీవీప్యాట్ లెక్కింపుపై గతంలో తామిచ్చిన ఆదేశాలే అమలవుతాయని, 100 శాతం స్లిప్ లను లెక్కించాలన్న పిటిషన్ ను తిరస్కరిస్తున్నామని వెల్లడించింది. 'టెక్నోపర్‌ ఆప్‌' అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం, ఈ పిటిషన్ లో ఎలాంటి మెరిట్‌ లేదని అభిప్రాయపడింది. వీవీప్యాట్ల లెక్కింపు విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

ఇదిలావుండగా, ఎన్డీయేతర 21 విపక్ష పార్టీల నేతలు నేడు ఈసీని కలవనున్న సంగతి తెలిసిందే. తొలుత వీవీప్యాట్ లను లెక్కించి, ఆ తరువాత ఈవీఎంలను లెక్కించాలన్నది వీరి డిమాండ్ కాగా, తొలుత లెక్కించే వీవీప్యాట్ స్లిప్ లలో తేడాలు వస్తే, మొత్తం వీవీప్యాట్లను లెక్కించాలని ఈసీని 21 పార్టీలూ కోరనున్నాయి.

  • Loading...

More Telugu News