Anantapur District: మరోసారి అదే గదిలో బస... సెంటిమెంట్ ను నమ్ముకున్న బాలయ్య!

  • అనంతపురం ఆర్టీటీ స్టేడియంలో 9వ నంబర్ గది
  • గత ఎన్నికల కౌంటింగ్ వేళ అదే గదిలో బాలయ్య
  • ఇప్పుడు మరోసారి అక్కడే బసకు ఏర్పాట్లు పూర్తి

అది అనంతపురంలోని ఆర్టీటీ స్టేడియంలోని 9వ నంబర్ గది. ఈ గది అంటే నందమూరి బాలకృష్ణకు ఎంతో సెంటిమెంట్ అట. అందుకని మరోసారి అదే గదిలో ఆయన బస చేయాలని నిర్ణయించుకోగా, ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇంతకూ ఆ సెంటిమెంట్ ఏంటి?, ఆ గది కథేంటని అనుకుంటున్నారా?

2014లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలయ్య తొలిసారిగా పోటీ పడిన వేళ, ఓట్ల లెక్కింపు జరిగే సమయంలో ఆర్టీటీ స్టేడియంలోని 9వ నంబర్ గదిలో బాలకృష్ణ బస చేసి, కౌంటింగ్ సరళిని పరిశీలించారు. ఇక ఆ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంతో అది సెంటిమెంట్ అయింది. ఇక రేపు కౌంటింగ్ కాగా, ఎస్కే యూనివర్శిటీలో ఓట్ల లెక్కింపు సాగనుంది. ఆ సమయంలో తనకు అచ్చొచ్చిన అదే 9వ నంబర్ గదిలో బాలకృష్ణ బస చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే ఆ గదిని మరొకరికి కేటాయించిన అధికారులు, బాలయ్య కోరిక మేరకు దాన్ని ఖాళీ చేయించారు. ఈ సాయంత్రం నుంచి బాలయ్య ఇదే గదిలో బస చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News