Andhra Pradesh: ప్రజలు ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకోవాలి!: వెంకయ్య నాయుడు
- ప్రతీ జీవి మనలాంటిదేనని అర్థం చేసుకోవాలి
- అంతరించి పోతున్న జీవజాతులను కాపాడుకోవాలి
- ట్విట్టర్ లో స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య
ప్రతీ జీవి మనలాంటిదే అని తెలుసుకుని ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతితో కలిసి జీవించడం నేర్చుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. అంతరించి పోతున్న జీవజాతులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పర్యావరణ మార్పులు, జీవవైవిధ్యం పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రజలకు జీవవైవిధ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.