Telugudesam: మంగళగిరిలో లోకేశ్.. పోటీ చేసిన రెండు చోట్ల ఆధిక్యంలో పవన్
- వెల్లడవుతున్న ఆధిక్యాలు
- టీడీపీ-వైసీపీ పోటాపోటీ
- అరకులో కిడారి శ్రావణ్ కుమార్ ఆధిక్యం
ఈ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఆధిక్యాలు అప్పుడే బయటికొస్తున్నాయి. ఆ సమాచారం ప్రకారం ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య పోరు హోరాహోరీగా ఉన్నట్టు కనిపిస్తుంది. మంగళగిరిలో లోకేశ్ ఆధిక్యంలో ఉండగా, చీపురుపల్లిలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆధిక్యంలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ ఆధిక్యంలో ఉంది.
భీమిలిలో టీడీపీ నేత సబ్బం హరి ఆధిక్యంలో ఉండగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న రెండు చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. టెక్కలిలో అచ్చెన్నాయుడు, శ్రీకాకుళంలో వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు, బొబ్బిలిలో టీడీపీ నేత సుజయ్ కృష్ణ రంగారావు, నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు, అరుకులో కిడారి శ్రవణ్ కుమార్, పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప, మండపేటలో వైసీపీ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, రామచంద్రాపురంలో టీడీపీ నేత తోట త్రిమూర్తులు ఆధిక్యంలో ఉన్నారు.