Gujarath: గుజరాత్, మధ్యప్రదేశ్, ఢిల్లీ లో బీజేపీ క్లీన్ స్వీప్.. బెంగాల్ లో హోరాహోరీ!
- బెంగాల్ లో 15 సీట్లలో బీజేపీ లీడింగ్
- గుజరాత్, మధ్యప్రదేశ్ లో మెజారిటీ సీట్లు
- లోక్ సభలో బీజేపీకి 336 చోట్ల లీడింగ్
పశ్చిమబెంగాల్ లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. మొత్తం 42 లోక్ సభ స్థానాలకు ఏడు దశల్లో జరిగిన ఎన్నికల్లో 15 సీట్లలో ఆధిక్యంలో దూసుకుపోతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ 25 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఓ స్థానంలో, ఇతరులు మరోస్థానంలో కొనసాగుతున్నారు. 2014 లోక్ సభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లకు పరిమితమైన కమలనాథులు ఈసారి గణనీయంగా పుంజుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు గుజరాత్ లో బీజేపీ క్లీన్ స్వీప్ దిశగా దూసుకుపోతోంది. మొత్తం 26 స్థానాలకు గానూ 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్ లోని 28 స్థానాలకు గానూ 27 స్థానాల్లో కమలనాథులు ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఢిల్లీలోని 7 స్థానాల్లోనూ బీజేపీ దూసుకుపోతోంది. తాజా అప్ డేట్ ప్రకారం దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 542 స్థానాలకు గానూ 336 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతోంది. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ 96 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, ఇతరులు 110 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.