kishan reddy: తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి పదవి?
- రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కిషన్ రెడ్డి
- మూడుసార్లు ఎమ్మెల్యేగా అనుభవం
- మంత్రి పదవి పక్కా అని సంకేతాలు
తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఝలక్ ఇచ్చింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం జూలు విదిల్చింది. ఏకంగా నాలుగు స్థానాలను గెలుచుకుని సత్తా చాటింది. బీజేపీ గెలుచుకున్న స్థానాలన్నీ టీఆర్ఎస్కు గట్టి పట్టున్న ప్రాంతాలు కావడం గమనార్హం.
మరీ ముఖ్యంగా నిజామాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత పరాజయాన్ని ఎవరూ ఊహించలేదు. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత దారుణ పరాజయం పాలయ్యారు. మిగతా వారిలో సికింద్రాబాద్ నుంచి జి.కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు గెలుపొందారు. ఈ నలుగురిలో సీనియర్ నేత అయిన కిషన్ రెడ్డికి కేంద్రమంత్రి వర్గంలో చోటు లభించడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్‌గా రెండుసార్లు పనిచేసిన కిషన్‌రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఇందుకు కలిసి వస్తుందని చెబుతున్నారు.