Pawan Kalyan: నేను పవన్ వెంటే.. మరి మీరు?: సినీ నటుడు నిఖిల్
- సోషల్ మీడియాలో జనసైనికుల ఓదార్పు
- విజయం ఎప్పుడూ ఒకటితోనే మొదలవుతుందని ధైర్య వచనాలు
- సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ‘విత్ పీకే’
‘మార్పు కోసం’ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌కు తొలిసారే చేదు అనుభవం ఎదురైంది. పోటీ చేసిన రెండు చోట్ల అధినేత పవన్ ఓటమి పాలవగా, ఒక్క రాజోలులో మాత్రం పార్టీ అభ్యర్థి గెలవడంతో ఖాతా తెరిచింది. కింగ్ మేకర్‌గా నిలుస్తారనుకున్న పవన్ కూడా ఓటమి పాలవడం జనసేన నేతలను తీవ్ర నిరాశ పరిచింది. అయితే, ఆ వెంటనే తేరుకున్న జనసేన కార్యకర్తలు అధినేతకు మేమున్నామంటూ భరోసా ఇచ్చే పనిలో పడ్డారు. ‘విత్ పీకే’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లతో కేడర్‌లోనూ, అధినేతలోనూ ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ‘విత్ పీకే’ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
పవన్ సినిమా హిట్ కోసం పదేళ్లు ఆగామని, ఇప్పుడు మరో ఐదేళ్లు ఆగడానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ట్వీట్లు చేస్తున్నారు. ఇక, ఇప్పటి నుంచి వైసీపీతో పోరాడతామని, ఏదో ఒక రోజు విజయం తథ్యమని ట్వీట్ చేస్తున్నారు. అడుగు ఎప్పుడూ ఒకటితోనే మొదలవుతుందంటూ రాజోలు గెలుపును ఉదహరిస్తున్నారు. ఇది భవిష్యత్ విజయాలకు నాంది అని సినీ నటుడు నిఖిల్ ట్వీట్ చేశాడు. తాను పవన్‌తోనే ఉన్నానని, మరి మీరెవరితో ఉన్నారంటూ ప్రశ్నించారు.
ఫెయిల్ కాలేదు.. మనమే ఫెయిలయ్యాం. సొసైటీ ఫెయిలైంది. మంచి పాలనను అందిస్తామంటే ఓడించారు. మళ్లీ ఇప్పుడు మనమే అవినీతి అంటూ ఏడుస్తున్నాం’’ అంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణను ఉద్దేశించి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నాటి వీడియోను పోస్టు చేస్తున్నారు.