Narendra Modi: నేడు రాష్ట్రపతిని కలిసి రాజీనామా చేయనున్న నరేంద్ర మోదీ!
- నేడు చివరి క్యాబినెట్ భేటీ
- 16వ లోక్ సభను రద్దు చేస్తూ తీర్మానం
- 29న తిరిగి ప్రమాణం చేయనున్న మోదీ
నేడు తన చివరి క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. రాష్ట్రపతితో ప్రధాని అపాయింట్ మెంట్ సాయంత్రం 6 గంటలకు ఖరారైందని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. అంతకన్నాముందు జరిగే క్యాబినెట్ భేటీలో, మంత్రిమండలిని, ఆపై 16వ లోక్ సభ ను రద్దు చేస్తూ తీర్మానం చేయనున్నారు. జూన్ 3న ప్రస్తుత లోక్ సభ కాలపరిమితి ముగియనుండగా, అందుకు 9 రోజుల ముందే సభ రద్దు కానుంది. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించిన తరువాత, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలోగా వారణాసిలో పర్యటించనున్నారు. ఈ నెల 29న ఆయన మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.