Rahul Gandhi: అమేథీ భయమే రాహుల్‌ను వయనాడ్ రప్పించింది: పినరయి విజయన్
- అమేథీలో ఓడిపోతానని రాహుల్‌కు తెలుసు
- పార్టీ ఓడినా నేను మాత్రం రాజీనామా చేయబోను
- నా వ్యవహార శైలిని కూడా మార్చుకోను
అమేథీలో ఓడిపోతానన్న భయమే రాహుల్ గాంధీని వయనాడ్ రప్పించిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) ఘోర పరాజయాన్ని చవి చూసింది. ఓటమిపై విజయన్ శనివారం స్పందించారు. పార్టీ ఘోర ఓటమి పాలైనా ముఖ్యమంత్రి పీఠాన్ని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. సీఎం పదవికి తాను రాజీనామా చేసేది లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, తన వ్యవహార శైలిని కూడా మార్చుకోబోనన్నారు.
రాహుల్ గాంధీ అమేథీ నుంచి వయనాడ్‌కు ఎందుకు వచ్చారో ఇప్పుడు అందరికీ స్పష్టమై ఉంటుందని విజయన్ పేర్కొన్నారు. ‘‘అమేథీలో ఓడిపోతానన్న భయంతోనే ఆయన వయనాడ్‌ను ఎంచుకున్నారు. రాహుల్ వయనాడ్‌లో పోటీ చేయడం బీజేపీకి కలిసి వస్తుందని తాము చెప్పలేదన్నారు. రాహుల్ తన పోటీ ద్వారా తమకు లెఫ్ట్ పార్టీనే ప్రధాన శత్రువన్న సంకేతాలు ఇచ్చారని విజయన్ అన్నారు.