Andhra Pradesh: చంద్రబాబు ఆ ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి!: రామ్ గోపాల్ వర్మ
- కేసీఆర్ ను కలిసిన జగన్
- ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం
- చంద్రబాబును విమర్శించిన వర్మ
ఏపీకి కాబోయే సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల కలుసుకున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఇంటికి సతీసమేతంగా వెళ్లిన జగన్, తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్ ను ఆహ్వానించారు. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. కేసీఆర్, జగన్ కలయిక చూస్తుంటే తెలుగువారు ఒక్కటి అయినట్లు తనకు అనిపిస్తోందని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు కలసికట్టుగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ‘కలసికట్టుగా ఉంటేనే బలం.. ఒకరికి మరొకరు వ్యతిరేకంగా ఉంటే కాదని మాజీ సీఎం(చంద్రబాబు) అర్థం చేసుకోవాలి’ అని హితవు పలికారు. ఈ మేరకు ట్వీట్ చేసిన వర్మ.. జగన్ కేసీఆర్ ను కలుసుకున్నప్పటి వీడియోను తన ట్వీట్ కు జతచేశారు.