teja: 'చిత్రం' కథను రామోజీరావుగారు పూర్తిగా వినకుండానే ఓకే చెప్పారు: దర్శకుడు తేజ
- 'చిత్రం' కథతో రామోజీరావుగారిని కలిశాను
- రామోజీరావుగారు విశ్రాంతి వరకే కథ విన్నారు
- 'తేజ నీపై నమ్మకం వుంది' అన్నారు
తెలుగు తెరకి సరికొత్త ప్రేమకథా చిత్రాలను అందించిన దర్శకులుగా తేజ కనిపిస్తారు. విలక్షణమైన ప్రేమకథా చిత్రాల ద్వారా యూత్ ను ఆయన బాగా ఆకట్టుకున్నారు. ఆయన తొలి చిత్రంగా వచ్చిన 'చిత్రం' ప్రేమకథా చిత్రం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అలాంటి ఆ సినిమాను గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు.
"నేను 'చిత్రం' కథను రామోజీరావుగారికి చెప్పాను. ఆయన ఇంటర్వెల్ వరకూ విన్నారు. 'ఇది యూత్ ఫుల్ లవ్ స్టోరీ కదా .. నేను జడ్జ్ చేయలేను అన్నారు. ఎంత ఖర్చు అవుతుందని అడిగితే ఓ 30 లక్షలు అవుతుందని చెప్పాను. '40 లక్షలు తీసుకెళ్లండి .. పోయినా ఫరవాలేదు .. నేను మిమ్మల్ని నమ్ముతున్నాను .. సినిమా తీసేయండి' అని చెప్పారు. అలా 'చిత్రం' సినిమా తెరపైకి వచ్చింది. ఆ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది .. రామోజీరావుగారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టింది" అని చెప్పుకొచ్చారు.