Akash-1s: ఆకాశ్-1ఎస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్

  • రెండ్రోజుల వ్యవధిలో రెండు పరీక్షలు
  • సత్తాచాటిన డీఆర్ డీవో శాస్త్రవేత్తలు
  • ఉపరితలం నుంచి గగనతలంలో లక్ష్యాలను ఛేదించగల ఆకాశ్-1ఎస్

దేశీయంగా అభివృద్ధి చేసిన ఆకాశ్-1ఎస్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. రెండ్రోజుల వ్యవధిలో ఇది రెండో పరీక్ష. కాగా, ఆకాశ్-1ఎస్ మిస్సైల్ ను డీఆర్ డీవో శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇది మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. దీంట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపరిచారు. ఆకాశ్ క్షిపణిని మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగించే వీలుండడంతో, దీన్ని ఎక్కడికైనా నిమిషాల్లో తరలించే సౌలభ్యం కలుగుతుంది.

ఆకాశ్-1ఎస్ గగనతలంలో 30 కిలోమీటర్లు ఎత్తులో ప్రయాణిస్తున్న విమానాన్ని సైతం తాకగలదు. గాల్లో ప్రయాణించే విమానాలనే కాదు, క్రూయిజ్ మిసైళ్లు, ఎయిర్ టు సర్ఫేస్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను కూడా తుత్తునియలు చేయగల సామర్థ్యం ఈ ఆకాశ్-1ఎస్ క్షిపణికి ఉంది.

  • Loading...

More Telugu News