Hyderabad: బాబోయ్ భానుడు.. నిప్పుల కుంపటిలా మారిన తెలంగాణ.. 130 ఏళ్ల రికార్డును బద్దలుగొట్టిన సూరీడు

  • తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న వడగాలులు
  • జగిత్యాల జిల్లాలో అత్యధికంగా 47.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
  • ఈ నెలాఖరు వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

తెలంగాణ నిప్పుల కుంపటిలా తయారైంది. భానుడు గత రికార్డులను బద్దలుగొడుతూ నిప్పుల వాన కురిపిస్తున్నాడు. సోమవారం భాస్కరుడి విశ్వరూపానికి 130 ఏళ్ల రికార్డు చెరిగిపోయింది. జగిత్యాల జిల్లా కోల్వాయి, ఎండపల్లి రాజరాంపల్లిలో 47.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. 130 ఏళ్లలో తెలంగాణలో ఇది రెండో అత్యధిక ఉష్ణోగ్రత. ఇక, రామగుండంలో  47.2, ఆదిలాబాద్‌లో 45.8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రెండు పట్టణాల్లో మే నెలలో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత పదేళ్ల కాలంలో ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  

రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే అంతోఇంతో చల్లగా ఉండే హైదరాబాద్‌లోనూ భానుడు ప్రకోపం కొనసాగుతోంది. సోమవారం బేగంపేట విమానాశ్రయంలో 42.5 ఉష్ణోగ్రత నమోదు కాగా, బహదూర్‌పురలోని చందూలాల్‌ బారాదరి వద్ద 44.1, మాదాపూర్‌లో 44 డిగ్రీలుగా నమోదైంది. తెలంగాణలో నేటి నుంచి ఈ నెలాఖరు వరకు వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News