MPTC: పరిషత్ ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారు.. 128 లెక్కింపు కేంద్రాల్లో 978 లెక్కింపు హాళ్లలో కొనసాగనున్న కౌంటింగ్
- 31న శాసనమండలి ఎన్నిక
- జూన్ 4న ఓట్ల లెక్కింపు
- పాల్గొననున్న 34 వేల మంది సిబ్బంది
తెలంగాణ వ్యాప్తంగా మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు తేదీ ఖరారైంది. మొదట మే 27వ తేదీన లెక్కించాలని ప్రభుత్వం భావించింది. అయితే, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి శాసనమండలి ఎన్నిక ఈ నెల 31న జరగనుంది. దీనికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ 3న ఉండటంతో అవి ముగిసిన వెంటనే పరిషత్ ఓట్ల లెక్కింపు చేపట్టాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలోనే పరిషత్ ఓట్ల లెక్కింపును జూన్ 4న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఉదయం 8 గంటల నుంచి ఈ లెక్కింపు ప్రారంభం కానుంది. దీని కోసం రాష్ట్ర వ్యాప్తంగా 123 లెక్కింపు కేంద్రాల్లో 978 లెక్కింపు హాళ్లలో ప్రక్రియ కొనసాగనుంది. ఈ లెక్కింపు ప్రక్రియలో సుమారు 34 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.