Jagan: ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ కీలక ప్రకటన?

  • నవరత్నాల పథకంపై జగన్ ప్రకటన చేసే అవకాశం
  • వనరుల అందుబాటుపై ఇప్పటికే సమీక్ష
  • జూన్ 7న మంత్రి వర్గ విస్తరణ

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అదే వేదికపై నుంచి కీలక ప్రకటన ఒకటి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించిన ‘నవరత్నాల’ అమలుకు సంబంధించే ఈ ప్రకటన ఉండే అవకాశం ఉందని సమాచారం. నవర్నాల పథకం అమలుకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక వనరులు ఏమేరకు సహకరిస్తాయన్న దానిపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మాజీ సీఎస్ అజేయ కల్లంతో జగన్ సమీక్షించినట్టు తెలుస్తోంది.

అలాగే, జూన్ 3 నుంచి శాఖల వారీగా సమీక్షించనున్న జగన్, ఆరో తేదీన రాజధానిపై సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది. అనంతరం 7వ తేదీన మంత్రి వర్గాన్ని జగన్ విస్తరించనున్నారు. తొలుత పది మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోని ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా అంటే 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని ఎన్నికలకు ముందు జగన్ చెప్పారు. దీనిని బట్టి ఒక్కో జిల్లా నుంచి ఒక్కరు చొప్పున 25 మందికి మంత్రి వర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News