raj tarun: పెళ్లి పీటలెక్కనున్న రాజ్ తరుణ్

  • దూకుడు చూపించిన రాజ్ తరుణ్ 
  • ఇటీవల వరుస పరాజయాలు
  •  పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం

తెలుగు తెరపై కెరియర్ ఆరంభంలోనే దూకుడు చూపించిన యువ కథానాయకులలో రాజ్ తరుణ్ పేరు కూడా చెప్పుకోవచ్చు. వరుస సినిమాలతో యూత్ లో క్రేజ్ ను పెంచుకున్న రాజ్ తరుణ్ కి, ఆ తరువాత వరుస పరాజయాలు ఎదురవుతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో 'ఇద్దరి లోకం ఒకటే' చేస్తోన్న ఆయన, త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తాజాగా ట్విట్టర్ లో చాట్ చేసిన ఆయన అభిమానులకి ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే పెళ్లికూతురు ఎవరి అమ్మాయి? ఎక్కడ అమ్మాయి? చిత్రపరిశ్రమకి సంబంధించినవారి అమ్మాయా? బయట అమ్మాయా? అనే విషయాన్ని మాత్రం ఆయన సస్పెన్స్ లోనే ఉంచాడు. త్వరలోనే ఆ విషయాలు కూడా చెబుతాడేమో చూడాలి.

  • Loading...

More Telugu News