sensex: మూడు రోజుల జోరుకు బ్రేక్... భారీ నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్
- బ్యాంకింగ్, మెటల్ షేర్లకు అమ్మకాల ఒత్తిడి
- 247 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 3 శాతం పైగా నష్టపోయిన ఎస్బీఐ
దేశీయ స్టాక్ మార్కెట్ల మూడు రోజుల జోరుకు ఈరోజు బ్రేక్ పడింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, మారుతి సుజుకి తదితర సంస్థలు ఈనాటి నష్టాలను ముందుండి నడిపించాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 247 పాయింట్లు కోల్పోయి 39,502కి పడిపోయింది. నిఫ్టీ 67 పాయింట్లు పతనమై 11,861కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.41%), టీసీఎస్ (1.78%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.17%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.48%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.27%).
టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.29%), టాటా స్టీల్ (-2.76%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.67%), టాటా మోటార్స్ (-2.46%), మారుతి సుజుకి (-2.33%).