sensex: మోదీ ఎఫెక్ట్.. దూసుకుపోయిన మార్కెట్లు
- కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటంతో బలపడిన ఇన్వెస్టర్ల సెంటిమెంట్
- 330 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 85 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
నిన్న నష్టాలను మూటగట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. ప్రధానిగా మోదీ నేడు రెండోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న నేపథ్యంలో మార్కెట్లు లాభాలను మూటగట్టుకున్నాయి. దేశంలో మరోసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ తదితర కంపెనీలు మార్కెట్లను ముందుండి నడిపించాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 330 పాయింట్లు లాభపడి 39,832కి పెరిగింది. నిఫ్టీ 85 పాయింట్లు పుంజుకుని 11,946కి ఎగబాకింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎన్టీపీసీ (3.44%), భారతి ఎయిర్ టెల్ (2.33%), బజాజ్ ఫైనాన్స్ (2.07%), టీసీఎస్ (1.91%), యస్ బ్యాంక్ (1.88%).
టాప్ లూజర్స్:
సన్ ఫార్మా (-2.39%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.61%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.35%), వేదాంత లిమిటెడ్ (-1.12%), ఓఎన్జీసీ (-1.11%).