KTR: కేటీఆర్ కు డబ్ల్యూఈఎఫ్ సదస్సుకు ఆహ్వానం!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆహ్వానం
- అక్టోబర్ 3 నుంచి రెండు రోజుల సమావేశాలు
- తన అనుభవాలను కేటీఆర్ పంచుకోవాలన్న నిర్వాహకులు
ఈ సంవత్సరం అక్టోబర్ 3 నుంచి రెండు రోజుల పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆన్ ఇండియా (డబ్ల్యూఈఎఫ్) సదస్సు జరుగనుండగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఆహ్వానం అందింది. సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరగనుండగా, ఈ సంవత్సరం 'మేకింగ్ టెక్నాలజీ వర్క్స్ ఫర్ ఆల్' అనే థీమ్ పై సమావేశంలో చర్చలు జరుగుతాయి.
ఇండియాలోని ఆదర్శవంతమైన కార్యక్రమాలపై చర్చించేందుకు ముఖ్యులను ఆహ్వానిస్తున్నామని, కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఎన్నో రంగాల్లో దూసుకెళ్లిందని సదస్సు నిర్వాహకులు వెల్లడించారు. కేటీఆర్ మంత్రిగా ఉన్న వేళ, ఇన్నోవేషన్, సాంకేతికత రంగాల్లో రాష్ట్రం వినూత్న విధానంలో నడిచి, దేశాన్ని ఆకర్షించిందని తెలిపింది. కేటీఆర్ ఈ సమావేశానికి హాజరై, తన అనుభవాలను పంచుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతోనే ఆయన్ను ఆహ్వానించినట్టు వెల్లడించింది.