union ministers for state: కేంద్ర సహాయ మంత్రులకు పోర్ట్ ఫోలియోలు ఖరారు.. కిషన్ రెడ్డికి కీలక శాఖ
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కిషన్ రెడ్డి
- అనురాగ్ సింగ్ ఠాకూర్ కు ఆర్థిక శాఖ, వాణిజ్య వ్యవహారాల శాఖ
- రాందాస్ అథవాలేకు సామాజిక న్యాయ శాఖ
నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం నిన్న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కొత్త కేంద్ర సహాయ మంత్రులకు కాసేపటి క్రితం శాఖలను కేటాయించారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే క్రమంలో సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డికి కీలక శాఖను కట్టబెట్టారు. ఎవరెవరికి ఏయే శాఖలు దక్కాయంటే...
- కిషన్ రెడ్డి: హోంశాఖ సహాయ మంత్రి
- అశ్విని కుమార్ చౌబే: ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ
- ఫగ్గన్ సింగ్: ఉక్కు శాఖ
- అర్జున్ రామ్ మేఘ్ వాల్: పార్లమెంటరీ వ్యవహారాలు, భారీ పరిశ్రమలు, వాణిజ్య శాఖలు
- జనరల్ (మాజీ) వీకే సింగ్: జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖలు
- క్రిషన్ పాల్: సామాజిక న్యాయ శాఖ
- రావ్ సాహెబ్ దాదారావ్: ఆహారం మరియు పౌరసరఫరాల శాఖ
- పురుషోత్తం రూపాల: వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ
- రాందాస్ అథవాలే: సామాజిక న్యాయ శాఖ
- సాధ్వి నిరంజన్ జ్యోతి: గ్రామీణాభివృద్ధి శాఖ
- బాబుల్ సుప్రియో: పర్యావరణం, అడవుల శాఖ
- సంజీవ్ కుమార్ బల్యన్: డైరీ, మత్స్య శాఖ
- సంజయ్ శ్యాంరావ్: మానవవరుల శాఖ, ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ
- అనురాగ్ సింగ్ ఠాకూర్: ఆర్థిక శాఖ, వాణిజ్య వ్యవహారాల శాఖ
- అంగడి సురేష్ చెన్నబసప్ప: రైల్వే శాఖ
- నిత్యానంద్ రాయ్: హోం శాఖ
- రతన్ లాల్ కఠారియా: జల శక్తి శాఖ, సామాజిక న్యాయ శాఖ
- మురళీధరన్: విదేశాంగ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
- రేణుకా సింగ్ సరుత: గిరిజన వ్యవహారాల శాఖ
- సోమ్ ప్రకాశ్: వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ
- రామేశ్వర్ తేలి: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ
- ప్రతాప్ చంద్ర సారంగి: చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖతో పాటు డైరీ, మత్స్య శాఖ
- కైలాశ్ చౌదరి: వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ
- సుశ్రీ దేవశ్రీ చౌదరి: మహిళా శిశు సంక్షేమ శాఖ