radha prashanthi: నా అసలుపేరు కృష్ణవేణి .. ఆ పేరు అలా మారిపోయింది: నటి రాధా ప్రశాంతి
- నాట్య ప్రదర్శనలిచ్చే దానిని
- అమ్మను ఒప్పించి నటన వైపుకు వచ్చాను
- హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చాను
నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాధా ప్రశాంతి, తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. వైజాగ్ లో నేను వెంపటి చినసత్యం గారి దగ్గర డాన్స్ నేర్చుకున్నాను. ఒకసారి నేను నాట్య ప్రదర్శన ఇస్తుండగా ఒక సినిమాకి సంబంధించిన యూనిట్ వాళ్లు చూశారు. తమ సినిమాలో హీరోయిన్ గా చేయమని వాళ్లు అడిగితే ముందుగా అమ్మ ఒప్పుకోలేదు. ఆ తరువాత అమ్మను ఒప్పించి నటిగా నా ప్రయాణాన్ని మొదలుపెట్టాను.
ముందుగా 'ఈ దేశం ఏమైపోతుందో' అనే సినిమా చేశాను. ఆ తరువాత 'శ్రీదేవి నర్సింగ్ హోమ్'లో చేశాను. కానీ ఈ రెండు సినిమాల కంటే ముందు 'పరువు ప్రతిష్ఠ' విడుదలైంది. ఈ సినిమాలోని జర్నలిస్ట్ ప్రశాంతి పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. నాకు 'రాధ' పోలికలు ఉండటం వలన 'రాధ' అనీ .. 'ప్రశాంతి' పాత్రతో పాప్యులర్ కావడం వలన 'రాధా ప్రశాంతి' అని పిలిచేవాళ్లు. నా అసలు పేరు మాత్రం కృష్ణవేణి అని ఆమె చెప్పుకొచ్చారు.