subbaraya sharma: ఎన్టీఆర్ సాహసోపేత నిర్ణయాలు ఇష్టం: సీనియర్ నటుడు సుబ్బరాయ శర్మ
- 'మాయా బజార్' 27సార్లు చూశాను
- 'రాజు పేద'లో బిచ్చగాడుగా చేశారు
- వృద్ధుడైన భీష్ముడి పాత్రలో మెప్పించారు
సీనియర్ నటుడు సుబ్బరాయ శర్మ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించారు. "మొదటి నుంచి కూడా నాకు ఎన్టీ రామారావుగారంటే పిచ్చి. ఆయన సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. పౌరాణిక చిత్రాల్లో రామారావుగారు వీరవిహారం చేసేవారు. ఆయన కోసం నేను 'మాయా బజార్' సినిమాను 27 సార్లు చూశాను.
ఒక దాంట్లో రాముడు ఆయనే .. మరో సినిమాలో రావణుడు ఆయనే .. ఇంకో సినిమాలో భీష్ముడు ఆయనే. అలా ఆయన విలక్షణమైన పాత్రలను పోషించి మెప్పించిన తీరు నాకు అద్భుతంగా అనిపించేది. మంచి వయసులో ఉండగానే వృద్ధుడైన 'భీష్ముడు' గా నటించారు. తిరుగులేని కథానాయకుడిగా ఒక వెలుగు వెలుగుతోన్న కాలంలో, 'రాజు పేద' సినిమాలో 'బిచ్చగాడు' పాత్రను పోషించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన సాహసోపేత నిర్ణయాలు నిజంగానే ప్రశంసనీయం" అంటూ చెప్పుకొచ్చారు.