Srikakulam District: ఉత్తరాంధ్రలో పిడుగులతో కూడిన భారీ వర్షం!
- ఉదయం 10 గంటల నుంచి వర్షాలు
- ఉపరితల ద్రోణి కారణంగా వానలు
- ముందే హెచ్చరించిన అధికారులు
ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన భారీ వర్గం కురుస్తోంది. ఈ ఉదయం 10 గంటల నుంచి శ్రీకాకుళం, టెక్కలి తదితర ప్రాంతాలతో పాటు విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తున్నాయని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. పిడుగులు పడతాయన్న సమాచారాన్ని గంటముందే ఆర్టీజీఎస్ ద్వారా ఆయా ప్రాంతాల్లోని అధికారులకు చేరవేశామని పేర్కొన్నారు. కాగా, టెక్కలి ప్రాంతంలో గాలులకు పలు చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినట్టు తెలుస్తోంది. ఈ వర్షాలతో ఎండవేడిమి ఒక్కసారిగా తగ్గి, ప్రజలు కాస్తంత ఉపశమనం పొందుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.