CM KCR: రాంపూర్ పంప్‌హౌస్ పనులను పరిశీలించిన తెలంగాణ సీఎం కేసీఆర్
- కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న పంప్ హౌస్
- పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆరా
- అనంతరం మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు
తెలంగాణ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ సారధి కేసీఆర్ స్వయం పర్యవేక్షణలో నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరంలో భాగంగా నిర్మాణంలో ఉన్న రాంపూర్ పంప్‌హౌస్ నిర్మాణాలను సీఎం కేసీఆర్ ఈరోజు ఉదయమే పరిశీలించారు. జగిత్యాల జిల్లా రాంపూర్‌ను చేరుకున్న ఆయన నవయుగ చైర్మన్ సి.విశ్వేశ్వరరావుతో పనుల పురోగతిపై చర్చించారు. లక్ష్యం మేరకు పనులు జరుగుతున్నాయా? లేదా? అన్న దానిపై ఆరాతీశారు.
అనంతరం మేడిగడ్డ బ్యారేజీ పనుల పరిశీలనకు వెళ్లారు. అధికారులతో సమీక్ష అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు తిరిగి హైదరాబాదుకి బయలుదేరి వెళతారు. ఇరవై రోజుల క్రితమే మేడిగడ్డతోపాటు కన్నేపల్లి పంప్‌హౌస్, తెలంగాణ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్ ఇంత తక్కువ వ్యవధిలో మళ్లీ పనుల పరిశీలన చేయడం గమనార్హం.