janasena: ‘జనసేన’కు షాక్.. పార్టీకి రాజీనామా చేసిన రావెల కిషోర్ బాబు
- ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ కు లేఖ రాసిన రావెల
- వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీకి రాజీనామా చేస్తున్నా
- రాజీనామాను ఆమోదించాలని కోరిన రావెల
జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నేత రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఓ లేఖ రాశారు. వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఎమ్మెల్యేగా రావెల పోటీ చేసి ఓటమిపాలయ్యారు. జనసేన పార్టీలోకి రాకముందు రావెల టీడీపీలో ఉన్నారు.