Andhra Pradesh: మా నాయకుడు జగన్ బాటలో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తా!: మంత్రి పుష్ప శ్రీవాణి
- ఈరోజు మంత్రిగా ప్రమాణస్వీకారం
- కురుపాం నుంచి గెలుపొందిన శ్రీవాణి
- ఎస్టీ మహిళ కోటాలో వరించిన పదవి
విజయనగరం జిల్లాలోని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి ఈరోజు ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ.. ‘మా నాయకుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు నన్ను తన కేబినెట్లోకి తీసుకున్నందుకు కృతజ్ఞతలు. నేను మా నాయకుడి బాటలో నడుస్తూ ప్రజలకు మంచి చేసేందుకు కృషి చేస్తా’ అని ట్వీట్ చేశారు. పుష్ప శ్రీవాణి టీచర్ ఉద్యోగాన్ని వదిలి భర్త ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు.
2014 ఎన్నికల్లో కేవలం 27 ఏళ్ల వయసులో ఆమె వైసీపీ తరఫున బరిలోకి దిగి 19,083 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించారు. దీంతో ఎస్టీ మహిళా కోటాలో ఆమెను మంత్రి పదవి వరించింది. పుష్ప శ్రీవాణి ప్రస్తుతం జియ్యమ్మ వలస మండలంలోని చినమేరంగి కోటలో నివాసం ఉంటున్నారు.