owaisi: రెండో పెద్ద పార్టీ మాదే.. ప్రతిపక్షహోదా ఇవ్వండి: అసదుద్దీన్ ఒవైసీ
- కాంగ్రెస్ కంటే మాకే ఎక్కువ ఎమ్మెల్యేలు ఉన్నారు
- త్వరలోనే స్పీకర్ ను కలుస్తాం
- ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం
టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం నేపథ్యంలో, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిపోయింది. ఈ నేపథ్యంలో, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం ఉందని... ఈ నేపథ్యంలో, తమకు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను ఇవ్వాలని స్పీకర్ ను కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ కంటే తమకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలసి స్పీకర్ ను కలుస్తామని... ఆయన సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని తెలిపారు.