KVP: 'మీ వియ్యంకుడు కేవీపీని వైసీపీలోకి తెస్తున్నారా?' అన్న ప్రశ్నకు రఘురామకృష్ణంరాజు సమాధానం ఇది!
- మేమంతా ఒకే కుటుంబం
- సోషల్ మీడియాలో రాతలు మాత్రమే
- ఈ విషయం కేవీపీతో మాట్లాడలేదన్న రఘురామకృష్ణంరాజు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించిన రఘురామకృష్ణంరాజు, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగు మిత్రుడు కేవీపీ రామచంద్రరావు వియ్యంకులన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి జగన్ విడిపోయి, వేరు పార్టీని పెట్టుకుని, అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, కేవీపీని తిరిగి జగన్ వద్దకు చేర్చేలా ఏమైనా ప్రణాళికలు వేస్తున్నారా? అని ఓ టీవీ చానెల్ అడిగిన ప్రశ్నకు రఘురామకృష్ణంరాజు ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
"నేను... సోషల్ మీడియాలో చదివాను దాని గురించి... మేమంతా వన్ ఫ్యామిలీ అండీ. రాజశేఖరరెడ్డిగారు, కేవీవీ రామచంద్రరావు గురించి అందరికీ తెలిసిందే. యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్... మొన్న ఫంక్షన్ కి ఆయన వచ్చారు. అదో హ్యాపీ అకేషన్. దాన్ని సోషల్ మీడియాలో రాశారు. ఈయన త్వరలో వచ్చేయొచ్చు అని. అదే చదివాను తప్ప, మా వియ్యంకుడి గారితో ఈ విషయం నేనెన్నడూ మాట్లాడలేదు" అన్నారు. వైఎస్ కు కేవీపీ మాదిరిగా, జగన్ కు విజయసాయిరెడ్డి అటువంటి వారేనని, జగన్ ను రాజు అనుకుంటే, విజయసాయిరెడ్డి ఓ అద్భుతమైన మంత్రని కితాబిచ్చారు.