Calender: 2019 - 20 విద్యా సంవత్సరానికి తెలంగాణ అకాడమిక్ కేలండర్ విడుదల
- రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం
- అకడమిక్ కేలెండర్ను రూపొందించిన విద్యాశాఖ
- సిలబస్, పరీక్షల నిర్వహణ క్యాలెండర్లో రూపకల్పన
వేసవి సెలవుల అనంతరం రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరానికిగాను విద్యాశాఖ అకడమిక్ కేలెండర్ను రూపొందించింది. సిలబస్, పరీక్షల నిర్వహణ సెలవుల వివరాలను ఈ క్యాలెండర్లో పొందుపరిచారు. దీనిని బట్టి, ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 232 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి.
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకూ ఫిబ్రవరి 29 నాటికి సిలబస్ బోధన పూర్తవుతుంది. పదో తరగతి విద్యార్థులకు జనవరి 10 నాటికి సిలబస్ పూర్తవుతుంది. అక్టోబర్ 21 నుంచి 26 వరకూ ఎస్ఏ 1 పరీక్షలు, ఏప్రిల్ 7 నుంచి 16 వరకూ ఎస్ఏ 2 పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 29 నాటికి ప్రీ ఫైనల్ పరీక్షలు పూర్తి కానున్నాయి. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13 నాటికి మొత్తం 16 రోజులు దసరా సెలవులు, మిషనరీ పాఠశాలలకైతే డిసెంబర్ 22 నుంచి 28 వరకూ ఏడు రోజులు క్రిస్మస్ సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి 16 వరకూ సంక్రాతి సెలవులు, ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులుగా పేర్కొంటూ అకడమిక్ కేలెండర్ను రూపొందించింది.