Wolf: 40 వేల ఏళ్ల నాడు రాకాసి తోడేలు ఇలా... ఇప్పటికీ చెక్కు చెదరని తల లభ్యం!
- సైబీరియాలో శాస్త్రవేత్తలకు లభ్యం
- 16 అంగుళాల పొడవున్న తల
- సింహం బలంతో పోల్చి చూస్తామన్న సైంటిస్టులు
దాదాపు 40 వేల సంవత్సరాల నాటి రాకాసి తోడేలు తల ఇప్పటికీ చెక్కు చెదరకుండా లభ్యంకావడం సైబీరియాలో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. మెదడుతో సహా తోడేలు తల, ఇతర భాగాలు పాడవకుండా ఉండటం గమనార్హం. ఈ తోడేలు తల ప్రస్తుతం కనిపించే తోడేళ్ల తల కన్నా చాలా పెద్దదిగా ఉండటం గమనార్హం. సాధారణ తోడేళ్ల తల 9 అంగుళాల వరకూ పొడవు ఉంటుంది. కానీ శాస్త్రవేత్తలకు లభ్యమైన ఈ రాకాసి తోడేలు తల ఏకంగా 16 అంగుళాల పొడువు ఉండటం గమనార్హం.
సైబీరియాలోని యాకుటియాల అనే ప్రాంతంలో ఇది రష్యన్ శాస్త్రవేత్త డాక్టర్ అల్బర్ట్ ప్రోటోపోపోవ్ బృందానికి లభ్యమైంది. పూర్తి స్థాయి కణజాలంతో ఓ జంతువు తల లభ్యంకావడం ఆధునిక మానవ చరిత్రలో ఇదే తొలిసారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాకాసి తోడేలు తల, కండరాలు, మెదడు బాగానే ఉన్నాయని, ప్రస్తుత తోడేళ్ల జాతితో పాటు, సింహాలతో దీన్ని పోల్చి చూస్తామని టోక్యోకు చెందిన జికియే యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు ప్రొఫెసర్ నావోకీ సుజుకి వెల్లడించారు.