Jammu And Kashmir: జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలల పొడిగింపు
- గతేడాది డిసెంబరు నుంచి అమల్లో ఉన్న రాష్ట్రపతి పాలన
- అంతకుముందు కొన్నాళ్లు గవర్నర్ పాలనలో కశ్మీర్
- అమర్నాథ్ యాత్ర ముగిశాక ఎన్నికల షెడ్యూల్
జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ బుదవారం నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబరులో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు. అంతకుముందు పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చాక కొన్నాళ్లు గవర్నర్ పాలన కొనసాగింది. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు.
తాజా నిర్ణయం జూలై మూడు నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ఈ ఏడాది చివర్లో జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అమర్నాథ్ యాత్ర ముగిశాక ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయనుంది. జూలై ఒకటిన అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుండగా, 46 రోజులపాటు ఇది కొనసాగనుంది. యాత్ర ముగిసిన అనంతరం షెడ్యూలు విడుదల చేసేందుకు ఈసీ సమాయత్తం అవుతోంది.