vayu: దిశ మార్చుకున్న 'వాయు' తుపాను
- రాత్రికి రాత్రే దిశ మార్చుకున్న తుపాను
- గుజరాత్ ను తుపాను తాకదు
- అయితే, తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయి
గుజరాత్ రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్తను అందించింది. వాయు తుపాను దిశను మార్చుకుందని... రాష్ట్రాన్ని ఈ తుపాను తాకదని తెలిపింది. రాత్రికి రాత్రే తుపాను దిశ మార్చుకుందని... సౌరాష్ట్ర తీరం నుంచి దూరంగా వెళ్లిందని వెల్లడించింది. అయితే తీరం వెంబడి 150 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది.
గుజరాత్ పై వాయు తుపాను విరుచుకుపడబోతోందనే వార్తలతో రాష్ట్ర ప్రజలు భయాందోళనలకు గురైన సంగతి తెలిసిందే. తుపాను ప్రభావం కారణంగా గుజరాత్, ముంబైలోని అన్ని బీచ్ లను మూసివేశారు. సహాయక చర్యల కోసం 52 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు.