Crime News: కరుడుగట్టిన పాతబస్తీ రౌడీషీటర్‌ అరెస్టు... ఐదు హత్యలు, పన్నెండు కిడ్నాప్‌ కేసులు

  • చిన్నాచితకా కలిపి 50కి పైగా క్రిమినల్‌ కేసులు
  • మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు
  • నిన్న చేపట్టిన ఆపరేషన్‌లో చిక్కిన మహ్మద్‌చాంద్‌

దాదాపు నలభై ఏళ్లుగా పలు నేరాలకు పాల్పడుతూ కరుడుగట్టిన రౌడీషీటర్‌గా పోలీసుల రికార్డులో నమోదై ఉండి.. మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు మహ్మద్‌ చాంద్‌ అలియాస్‌ చాంద్‌ పహిల్వాన్‌ను నిన్న పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి అరెస్టు చేశారు. హైదరాబాద్ పాతబస్తీ మంగళహాట్, రాజ్ దార్ ఖాన్ పేట ఏరియాకు చెందిన ఇతనిపై ఐదు హత్యలు, పన్నెండు కిడ్నాప్‌లు, 20కి పైగా బెదిరింపులతో కలిపి మొత్తం 50 వరకు క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నాయి.

భూ తగాదాలు, సెటిల్‌ మెంట్లలో ఇన్వాల్వ్‌ అవుతూ పలు హత్యలకు, కిడ్నాప్‌లకు పహిల్వాన్‌ పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. దీంతో గతంలో పోలీసులు చాంద్‌ మహ్మద్‌ను పీడీ చట్టం కింద అరెస్టు చేసి కోర్టు ముందుంచగా నిందితుడికి న్యాయ స్థానం రిమాండ్‌ విధించింది. దాదాపు ఏడాది పాటు జైలులో ఉన్న చాంద్‌ 2016లో బెయిల్‌పై బయటకు వచ్చాడు. అప్పటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. పోలీసులు తనకోసం గాలిస్తున్నట్లు తెలిసినప్పుడల్లా స్థావరాలు మారుస్తూ వారికి చిక్కకుండా తప్పించుకునే వాడు. దీంతో గురువారం పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News