Imran Khan: మరోసారి ప్రోటోకాల్ తుంగలో తొక్కిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
- విమర్శలపాలైన ఇమ్రాన్
- కిర్గిజిస్థాన్ లో అధ్యక్షుడి పట్ల అమర్యాదకర ప్రవర్తన
- సొంత పార్టీ ట్వీట్ లో ఇమ్రాన్ ప్రోటోకాల్ ఉల్లంఘన వెల్లడి
క్రికెటర్ గా గొప్ప పేరున్న ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ ప్రధానిగా అనేక వైఫల్యాలను చవిచూడాల్సి వస్తోంది. ఇంటా బయటా ఆయన పనితీరు ఎవరికీ సంతృప్తికరంగా లేదనే చెప్పాలి. ఇక, అంతర్జాతీయ వేదికలపై ప్రోటోకాల్ ను పట్టించుకోకపోవడంలో ఇమ్రాన్ కున్న చెడ్డపేరు మరెవరికీ లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా ఆయన మరోసారి అదే తప్పిదం చేసి దొరికిపోయారు.
కిర్గిజిస్థాన్ లో జరుగుతున్న షాంఘై కోపరేషన్ సెమినార్ లో పాల్గొనేందుకు వెళ్లిన ఇమ్రాన్, ఆతిథ్యం ఇస్తున్న దేశాధ్యక్షుడికి కనీస మర్యాద ఇవ్వాలన్న ఇంగితాన్ని మర్చిపోయారు. ప్రారంభ వేడుకల సమావేశం కోసం కిర్గిజ్ అధ్యక్షుడు వస్తుండగా, మోదీ, పుతిన్ తదితర దేశాధినేతలు మర్యాదపూర్వకంగా లేచి నిల్చున్నారు. ఇమ్రాన్ మాత్రం తనకు కేటాయించిన ఆసనంలో అలాగే కూర్చుండిపోయారు. ఇమ్రాన్ సొంత పార్టీ తెహ్రీకే ఇన్సాఫ్ ట్వీట్ చేసిన ఓ వీడియోలో ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన వెల్లడైంది.