Kishan Reddy: పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదం మన దేశంలో ఇక వినిపించకూడదు: కిషన్ రెడ్డి
- హింసతో ఏమీ సాధించలేరు
- ఆ మార్గాన్ని విరమించుకోవాలి
- గాంధీ, అంబేద్కర్ ఆలోచన విధానంతో ప్రభుత్వం పనిచేస్తోంది
తుపాకులు, హింస ద్వారా సాధించేదేమీ ఉండదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కశ్మీర్లో పోలీసులపై రాళ్లురువ్వడం, మనదేశంలో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదాలు చేయడం ఇకమీదట జరగకూడదని యువతకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ కాచిగూడలో ఆయన ఇవాళ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం గాంధీ, అంబేద్కర్ భావజాలంతో కూడిన ఆలోచనా విధానంతో పనిచేస్తోందని, హింసాత్మక మార్గాన్ని ఎంచుకున్నవారు ఆ ఆలోచన విరమించుకోవాలని సూచించారు.