Andhra Pradesh: రాష్ట్రంలో మండుతున్న ఎండలు... ఒంటిపూట బడులు మరో వారంపాటు కొనసాగింపు
- ఈ నెల 22వరకు రాష్ట్రంలో ఒంటిపూట బడులు
- ఎండలకు తోడు రాష్ట్రంలో వడగాడ్పులు
- ఈ నెల 24 నుంచి యథావిధిగా పూర్తిస్థాయిలో నడవనున్న స్కూళ్లు
జూన్ మాసం వచ్చినా ఎండల తీవ్రత తగ్గకపోవడంతో రాష్ట్రంలో ఒంటిపూట బడులు మరో వారం రోజుల పాటు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో పలుచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, వడగాడ్పులు అధికమయ్యాయి. ఇంటినుంచి బయటికి రావాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో, ఇప్పటికే కొనసాగుతున్న ఒంటిపూట బడులను ఈ నెల 22 వరకు అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ నెల 24 నుంచి అన్ని పాఠశాలలు యథావిధిగా పూర్తిస్థాయిలో నడుస్తాయని పేర్కొంది.