sensex: యూఎస్ ఉత్పత్తులపై భారత్ నిషేధం విధించవచ్చనే భయాందోళనలు.. కుప్పకూలిన మార్కెట్లు!
- అమ్మకాల ఒత్తిడికి గురైన దిగ్గజ కంపెనీల షేర్లు
- 491 పాయింట్లు పతనమైన సెన్సెక్స్
- 151 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కుప్పకూలాయి. దిగ్గజ కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. కొన్ని అమెరికా ఉత్పత్తులపై భారత్ నిషేధం విధించవచ్చనే భయాందోళనలు కూడా మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 491 పాయింట్లు నష్టపోయి 38,960కి పడిపోయింది. నిఫ్టీ 151 పాయింట్లు పతనమై 11,672కు దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (0.74%), కోల్ ఇండియా (0.10%). ఇన్ఫోసిస్ ఎలాంటి మార్పు లేకుండా ముగిసింది.
టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-5.66%), వేదాంత లిమిటెడ్ (-3.33%), టాటా మోటార్స్ (-3.20%), యాక్సిస్ బ్యాంక్ (-2.93%), భారతి ఎయిర్ టెల్ (-2.77%).