roja: జగన్ మాట ఇస్తే.. జీవోలు, చట్టాలు కూడా అవసరం లేదు: రోజా
- మహిళల కోసం విప్లవాత్మకమైన పథకాలకు శ్రీకారం చుట్టారు
- ప్రతి మహిళను లక్షాధికారులను చేస్తాం
- 25 లక్షల ఇళ్లు నిర్మించి మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తాం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశంసలు కురిపించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహిళల కోసం విప్లవాత్మకమైన పథకాలకు జగన్ శ్రీకారం చుట్టారని కితాబిచ్చారు. 45 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నాలుగేళ్లలో రూ. 75 వేలు అందజేస్తామని చెప్పారు. ప్రతి డ్వాక్రా మహిళను తమ ప్రభుత్వం లక్షాధికారులను చేస్తుందని తెలిపారు. ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించి, వాటిని మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేయిస్తామని చెప్పారు. జగన్ మాట ఇస్తే జీవోలు, చట్టాలు కూడా అవసరం లేదని అన్నారు.